తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు చేరిన మధ్యప్రదేశ్​ రాజకీయం

madhyapradesh
నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షపై సందిగ్ధం?

By

Published : Mar 16, 2020, 9:31 AM IST

Updated : Mar 16, 2020, 1:45 PM IST

12:39 March 16

మధ్యప్రదేశ్​ రాజకీయం సుప్రీంకోర్టుకు చేరింది. తక్షణమే శాసనసభలో బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది భాజపా. విశ్వాస పరీక్ష గురించి ప్రస్తావించకుండా అసెంబ్లీని స్పీకర్​ ఈ నెల 26 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈమేరకు దాఖలు చేసింది కమలదళం.

11:40 March 16

ఎటూ తేలకుండానే వాయిదా..

మధ్యప్రదేశ్ శాసనసభ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేశారు స్పీకర్​. గవర్నర్ లాల్జీ టాండన్ ప్రసంగాన్ని ఒక్క నిమిషంలోనే పూర్తి చేసి సభ నుంచి వెనుదిరిగారు. అనంతరం కాసేపటికే సభ వాయిదాపడింది. దీంతో కమల్​నాథ్ ప్రభుత్వం బలపరీక్ష అంశం ఎటూ తేలలేదు. 

10:54 March 16

శాసనసభ వద్దకు కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కమల్​నాథ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. అదే సమయంలో భాజపా శాసనసభ్యులు కూడా అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్​ లాల్జీ టాండన్​కు లేఖ రాశారు సీఎం కమల్​నాథ్. ఈ విశ్వాస పరీక్ష అనవసరమని లేఖలో పేర్కొన్నారు. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బలపరీక్షలో పాల్గొంటేనే విశ్వాస పరీక్ష సరైన విధానంలో సాగినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. 

08:20 March 16

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం రసకందాయంలో పడింది. కమల్​నాథ్ సర్కార్ బల పరీక్షపై సందిగ్ధత నెలకొంది. మరి విశ్వాస పరీక్షే జరిగితే... అధికార పీఠాన్ని కాంగ్రెస్​ నిలుపుకోనుందా? విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేక అధికారాన్ని భాజపాకు చేజార్చుకుంటుందా అనేది నేటితో తేలిపోతుంది. నేటి  నుంచి ఏప్రిల్​ 13 వరకు మధ్యప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు తన​ ప్రసంగం పూర్తి అయిన వెంటనే విశ్వాస పరీక్ష ఉంటుందని గవర్నర్​ లాల్జీ టాండన్​ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే విశ్వాసపరీక్ష నిర్వహించాలా వద్దా అన్న దానిపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ ఎన్​పీ ప్రజాపతి ప్రకటించిన కారణంగా ఈ అంశమై ఉత్కంఠ మరింత పెరిగింది.

అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 22 మంది కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను శనివారం ఆమోదించారు స్పీకర్​ ప్రజాపతి. తాజా నిర్ణయంతో.. మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత ప్రభుత్వానికి.. కాంగ్రెస్​ 108, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిపి 114 మంది బలం ఉంది.  

అయితే బెంగళూరులోని ఓ రిసార్ట్​లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఆరుగురి రాజీనామాలను స్పీకర్​ ఆమోదించగా.. మిగతా 16 మంది రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది.  22 మంది రెబల్​ ఎమ్మెల్యేల్లో మిగతా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 104కు చేరుతుంది. కాంగ్రెస్​ బలం 92కు చేరుకోవటం వల్ల మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిపోతుంది అధికార కూటమి. దీంతో భాజపాకు ఉన్న 107 స్థానాలతో అధికారం పీఠం దక్కించుకుంటుంది

Last Updated : Mar 16, 2020, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details