తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అందరి విశ్వాసాన్ని చూరగొందాం'

నూతనోత్సాహంతో సరికొత్త భారత నిర్మాణానికి మరో ప్రయాణం మొదలైందన్నారు ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ. ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

By

Published : May 26, 2019, 6:10 AM IST

Updated : May 26, 2019, 7:26 AM IST

'అందరి విశ్వాసాన్ని చూరగొందాం'

'అందరి విశ్వాసాన్ని చూరగొందాం'

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్డీఏ కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా ప్రసంగించారు మోదీ.

'సురాజ్యం కోసం శ్రమిద్దాం...'

నూతన భారత్​ను నిర్మించేందుకు సరికొత్త ప్రయాణం మొదలైందని వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీ.

ఎవరి విశ్వాసాలను అగౌరపరచకుండా, ఏ వర్గం పట్ల నిర్లక్ష్యం చూపకుండా సుపరిపాలన అందించాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు.

"1857నాటి స్ఫూర్తిని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి. బానిసత్వం నుంచి విడుదలకు భుజం.. భుజం కలిపి పోరాడారు. ప్రస్తుతం మంచి రాజ్యం కోసం, పేదరికం నుంచి విడుదలకు పోరాడాలి. ఐకమత్యంతో పోరాటం సాగించాలి. అందరినీ కలుపుకుపోవాలి. భయపడుతున్నామనే ఆరోపణలను మన జీవన విధానంతో తప్పని నిరూపించాలి. భాజపాకు ఓటు వేసినవారు, వ్యతిరేకించేవారు ఇద్దరూ మనవారే. 130కోట్ల జనాభాలో మనకు భేద భావాలు ఉండకూడదు. సబ్​కా సాథ్.. సబ్​కా వికాస్ అనేది మన నినాదం... ఇప్పుడు దానికి సబ్​కా విశ్వాస్​నూ చేర్చాలి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ప్రజాస్వామ్యానికి దీవెన: అమిత్​షా

ఎన్డీఏ గెలుపుతో వారసత్వ రాజకీయాలు, వర్గం, వ్యక్తిస్వామ్యం నుంచి దేశానికి విముక్తి లభించినట్లయిందన్నారు భాజపా అధ్యక్షుడు అమిత్​షా. తమ గెలుపు ప్రజాస్వామ్యానికి దీవెన వంటిదని భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు. 1960 నుంచి కొనసాగుతున్న వారసత్వ రాజకీయాలు అనే వ్యాధి నుంచి తాజా ఫలితాలు దేశాన్ని కాపాడాయన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చేందుకు వివిధ పథకాలతో ఇప్పటికే పని చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రపతితో ఎన్డీఏ పార్లమెంటరీ నేతల భేటీ

భాజపా అధ్యక్షుడు అమిత్​షా నేతృత్వంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. తమ లోక్​సభ పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు.

'ప్రభుత్వం ఏర్పాటు చేయండి'

ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన మోదీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు రాష్ట్రపతి. కేబినెట్​ మంత్రుల పేర్లు సిఫారసు చేసి ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయించాలని సూచించారు.

ఇదీ చూడండి: బిడ్డకు 'మోదీ' పేరు పెట్టిన ముస్లిం మహిళ

Last Updated : May 26, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details