వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోన్న వేళ, అనేక సందేహాలు, అపనమ్మకాల మధ్య జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం నేడు జరగనుంది. ఇందుకు ఫ్రెంచ్ తీర ప్రాంత నగరం బియారిట్జ్ వేదిక కానుంది.
వాణిజ్య యుద్ధాలు మాంద్యంలోకి నెట్టివేస్తాయని ఒప్పందాలు ఆర్థిక పురోగతికి బాటలు వేస్తాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ జీ 7 దేశాలకు సూచించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలపై పన్నులను ఉపసంహరించకుంటే ఫ్రెంచ్ వైన్‌పై సుంకాలు విధిస్తామని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, డొనాల్డ్ ట్రంప్ విందు సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కలిసి రావాలని అమెరికాకు ఈ సందర్భంగా మెక్రాన్ సూచించారు.