మహారాష్ట్రలో భాజపాతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. కానీ ప్రధాని ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్ ముఖాముఖిలో పాల్గొన్న శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ బంపర్ ఆఫర్.. శరద్ పవార్ నో..!
కలిసి పనిచేద్దామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారనే వార్తలను ఖండించారు. అయితే కేంద్ర మంత్రి వర్గంలోకి సుప్రియాను తీసుకునే ప్రతిపాదన ఉండేదని స్పష్టం చేశారు.
శరద్ పవార్‌కు మోదీ బంపర్ ఆఫర్..
"కలిసి పనిచేద్దామని మోదీ నాకు ప్రతిపాదన చేశారు. కానీ నేను వాటిని తిరస్కరించాను. ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. అవి అలాగే ఉంటాయని, కలిసి పనిచేయడం మాత్రం సాధ్యం కాదని చెప్పాను."-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత.
మోదీ ప్రభుత్వం తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపిందన్న వార్తలను శరద్ పవార్ ఖండించారు. అయితే పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే(శరద్ పవార్ కుమార్తె)ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ప్రతిపాదన ఉండేదని చెప్పారు.