దిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికీ కరోనా వైరస్ సెగ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులందరూ 'సామాజిక దూరం' పాటించారు. కనీసం మూడు అడుగుల దూరంలో కూర్చుని చర్చలు జరిపారు. దేశంలోని తాజా పరిస్థితులపై మోదీ సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.
కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ ' సామాజిక దూరం' - కేంద్ర కేబినెట్ సమావేశం
కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చేసి చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ 'సామాజిక దూరం' పాటించారు. ఇందుకు ప్రధాని మోదీకి కూడా మినహాయింపు లేదు.
కేంద్ర మంత్రులూ 'దూరం.. దూరమే'
దేశంలో వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. దేశం మొత్తాన్ని 21రోజుల పాటు లాక్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 562కు చేరింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అన్ని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇదీ చూడండి:-'పొరపాటు జరిగింది... ఆయన మృతికి కరోనా కారణం కాదు'
Last Updated : Mar 25, 2020, 1:26 PM IST