తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్కు లేకుంటే మెట్రోలోకి నో ఎంట్రీ

దేశవ్యాప్తంగా సెప్టెంబరు 7నుంచి మెట్రో సేవల పునరుద్ధరణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్​ పూరి. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. కంటైన్​మెంట్ జోన్లలోని స్టేషన్లు మూసే ఉంటాయని వెల్లడించారు.

Metro stations in COVID-19 containment zones to remain closed when services resume: Union minister Puri.
మెట్రో సేవల పునురుద్ధరణకు మార్గదర్శకాలు విడుదల

By

Published : Sep 2, 2020, 7:00 PM IST

Updated : Sep 2, 2020, 7:14 PM IST

సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్​ పూరి విడుదల చేశారు. కంటైన్​మెంట్ జోన్లలోని స్టేషన్లు మూసివేసే ఉంటాయని వెల్లడించారు.

మార్గదర్శకాలు ఇవే

  • మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే స్టేషన్​లోకి అనుమతించరు.
  • స్టేషన్లు, ప్లాట్ ఫాం, మెట్రోలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
  • డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్క్ లు అందుబాటులో ఉంచాలి.
  • ఎటువంటి లక్షణాలు లేని వారిని శరీర ఉష్ణోగ్రత పరిశీలించాకే లోనికి అనుమతిస్తారు.
  • అన్ని ప్రవేశ, నిష్క్రమణలు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ప్రదేశాల్లో శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
  • నేరుగా డబ్బు చెల్లించే అన్ని పద్ధతులు నిలిపివేయాలి.
  • అత్యంత తక్కువ లగేజ్​ను ప్రయాణికులు తీసుకురావాలి.
  • రైళ్లలో ఏసీ సరఫరాలో గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి.
  • ప్రయాణికులకు అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
  • మెట్రో రైలు కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం సహా స్థానిక పాలనా సిబ్బంది, పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి.
  • మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలి.

ఇదీ చూడండి: పబ్​జీ సహా 118 చైనా యాప్స్​పై నిషేధం

Last Updated : Sep 2, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details