ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీతో పొత్తుపై స్పష్టతనిచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ ఓట్లు బీఎస్పీకి పడలేదన్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తు కొనసాగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
"ఇవి శాశ్వత తెగదింపులు కాదు. ఎప్పుడైతే అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా విజయవంతం అవుతారో.. అప్పుడు మళ్లీ ఎస్పీతో కలిసి పనిచేస్తాం. ఈ విషయంలో ఆయన విఫలమయితే ఒంటరిగానే ప్రయత్నించటం మంచిదని భావిస్తున్నాం. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లో కొన్ని స్థానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించాం."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
కూటమి ఏర్పడ్డాక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ తనను ఎంతో గౌరవించారని మాయావతి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎస్పీతో సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టినట్టు మాయావతి స్పష్టం చేశారు.