తెలంగాణ

telangana

ఆవు పేడతో మాస్కు.. ఎరువుగానూ వాడొచ్చు!

By

Published : Nov 16, 2020, 10:17 AM IST

కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత మార్కెట్​లో ఎన్నోరకాల మాస్కుల దర్శనమిచ్చాయి. అయితే హిమాచల్​ప్రదేశ్​కు చెందిన ఓ సంస్థ ఆవు పేడతో మాస్కులు తయారు చేసి మార్కెట్​లో విడుదల చేసింది. ఇవి పర్యావరణ హితమైనవిగా పేర్కొన్న సంస్థ... వాడిన తర్వాత ఎరువుగా కూడా వాడొచ్చని తెలిపింది.

Masks made from cow dung introduced in market!
ఆవు పేడతో కరోనా కొత్త మాస్కు!

ఇప్పటి వరకు ఆవు పేడతో పిడకలు, ఎరువులను తయారు చేసేవారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మాస్కుల తయారీకీ దీన్ని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​లోని వేదిక్​ ప్లాస్టర్​ సంస్థ వీటిని మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ మాస్కులను ఆ తర్వాత ఎరువుగా కూడా వాడొచ్చు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి. 80 శాతం శుద్ధ ఆవుపేడ, 20 శాతం వెస్ట్​ కాటన్​ వస్త్రంతో కూడిన మిశ్రమాన్ని కాగితానికి జోడించడం ద్వారా వాటిని తయారు చేశారు.

జాతీయ కామధేను కమిషన్​ అందించిన ముడి పదార్థాలతో వేదిక్​ ప్లాస్టర్​ సంస్థ ఈ మాస్కులను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు పాలుపంచుకుంటున్నారు. ఈ మాస్కుల్లో యాంటీబ్యాక్టీరియల్​ లక్షణాలు ఉన్నాయని హోమియో వైద్యుడు రాజ్​కుమార్​ శర్మ తెలిపారు. వాటి వాడకం వల్ల ఎలాంటి హాని ఉండదని చెప్పారు. కూరగాయల విత్తనాలనూ ఉంచామని వేదిక్​ ప్లాస్టర్​ సంస్థకు చెందిన కరణ్​ సింగ్​ చెప్పారు.

ఇదీ చూడండి:కేంద్ర మంత్రివర్గంలోకి సుశీల్​ కుమార్​ మోదీ..?

ABOUT THE AUTHOR

...view details