హంపి... కర్ణాటకలోని చారిత్రక నగరం. విజయనగర సామ్రాజ్య కళా, సాహితీ సౌరభాన్ని కళ్లకుగట్టే నిలయం. అందుకే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది యునెస్కో. అంతటి విశిష్టత ఉన్న చోటుకు... ఒక వ్యక్తి సెల్ఫీ సరదా కారణంగా నష్టం జరిగింది.
జరిగిందిలా...

హంపిలోని పురాతన కట్టడాలను తిలకించేందుకు బెంగళూరు నుంచి వచ్చాడు నాగరాజు(45). అక్కడి అందాలకు ముగ్ధుడై వాటితో సెల్ఫీలు దిగే పనిలో నిమగ్నమయ్యాడు. పురాతన కట్టడాలపై చేయి వేసి ఫొటోలు దిగుతుండగా... 2 స్తంభాలు అకస్మాతుగా కూలిపోయాయి.
వెంటనే స్థానిక పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. 1958నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడిని 15 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇదీ చూడండి : 'విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించలేకపోయాం'