తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్రమ సంబంధం చిచ్చు... ఇద్దరు బలి

అక్రమ సంబంధం కారణంగా వివాదం తలెత్తి ఇద్దరు చనిపోయిన ఘటన తమిళనాడులో జరిగింది. ఒకరితో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమె కుటుంబంలోని మరొకరిపై కన్నేశాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యలతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే ఆ ఇంటి వృద్ధురాలిని హతమార్చి అడ్డువచ్చిన స్థానికులపై యాసిడ్​ దాడి చేశాడు. ఆగ్రహించిన స్థానికులు అతడిని కర్రలతో కొట్టి చంపారు.

man beaten to death after trying to thrown acids among villagers
అక్రమ సంబంధం చిచ్చు... ఇద్దరు బలి

By

Published : Dec 14, 2019, 9:20 PM IST

అక్రమ సంబంధం చిచ్చు... ఇద్దరు బలి

తమిళనాడు నమ్మక్కల్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబంలోని ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి అదే కుటుంబానికి చెందిన మరొకరిపై కన్నేశాడు. దీనికి ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. అతడిని వారించారు. అయితే మాట వినని ఆ మృగాడు యువతిని తనతో తీసుకెళ్లేందుకు పట్టుబట్టాడు. అడ్డువెళ్లిన స్థానికులపై యాసిడ్ దాడి చేశాడు. కుటుంబానికి పెద్ద దిక్కయిన వృద్ధురాలిపైనా యాసిడ్ దాడికి తెగబడ్డాడు. ఆగ్రహించిన స్థానికులు ఆ అనైతికవాదిని కర్రలతో కొట్టి చంపేశారు.

ఇదీ జరిగింది...

నమక్కల్ జిల్లాలోని గురుసామిపాలెంలో ధనం అనే వృద్ధురాలికి ఐదుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరి బాధ్యతలు తీరిపోయిన ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ధనం మూడో కుమార్తె విజయ. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడం వల్ల ఒంటరిగా ఉంటోంది. అదే సమయంలో ధర్మపురికి చెందిన సామ్యుూల్​తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. విజయ చిన్నక్క కుమార్తె వాసంతిని ఓ సందర్భంలో చూశాడు సామ్యూల్. అప్పటి నుంచి సామ్యూల్ కన్ను వాసంతిపై పడింది. ఇది తెలిసిన విజయ కుటుంబం అతడిని వారించింది.

దీనిపై ఆగ్రహించిన సామ్యూల్ ఓ కత్తి, యాసిడ్ సీసా తీసుకుని విజయ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వృద్ధురాలు ధనం, వాసంతి మాత్రమే ఉన్నారు. అమ్మాయిని తనతో పంపించాలని వృద్ధురాలిని బెదిరించాడు సామ్యూల్​. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జనాన్ని చూసి భయపడ్డ సామ్యూల్​.. తనని తాను రక్షించుకునేందుకు స్థానికులపై యాసిడ్ దాడికి తెగబడ్డాడు.

అనంతరం వృద్ధురాలిపై యాసిడ్​ దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు సామ్యూల్​పై కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పంచనామా కోసం తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details