దక్షిణ దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంద్కా ప్రాంతంలోని ఓ గోదాములో బుధవారం రాత్రి 10.23 గంటలకు ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటల భారీగా చెలరేగిన నేపథ్యంలో 34 అగ్నిమాపక శకటాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు దిల్లీ అగ్నిమాపక డైరెక్టర్‌అతుల్ గార్గ్ తెలిపారు. గోదాములో వైద్య పరికరాలు ఉన్నట్లు గార్గ్ వెల్లడించారు.