దేశంలో కరోనా కేసుల స్థిరంగా పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఒక్కరోజులో 11,416 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుల సంఖ్య 15,17,434కు పెరిగింది. వైరస్ సోకి మరో 308 మంది చనిపోయారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40,040కు చేరింది.
⦁ కేరళలో రికార్డు స్థాయిలో మరో 11,755 మంది కొవిడ్ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 2,77,855కు ఎగబాకింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 978మంది కరోనాతో మరణించారు.
⦁ కర్ణాటకలో కొత్తగా 10,517 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. బాధితుల సంఖ్య 7,00,786కు చేరింది. మరో 102 మంది మరణాలతో.. మొత్తం మరణాల సంఖ్య 9,981కి పెరిగింది.