తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాతో సీట్లపంపకం కొలిక్కిరాక ముందే..!

మహారాష్ట్రలో భాజపాతో సీట్ల పంపకంలో వివాదాలకు అవకాశం లేని 21 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది శివసేన. హోంమంత్రి దీపక్​ కేసర్కర్​కు జాబితాలో చోటు కల్పించింది.

21 స్థానాలకు శివసేన అభ్యర్థుల ఖరారు

By

Published : Sep 29, 2019, 10:01 PM IST

Updated : Oct 2, 2019, 12:45 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో సీట్ల పంపకం పూర్తవకముందే..21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన. ఈ స్థానాలకు భాజపా ఎలాంటి అభ్యంతరం తెలిపే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

కొంకణ్​ సింధుదుర్గ్​లోని సావంత్​వాడి నుంచి మహారాష్ట్ర హోమంత్రి దీపక్​ కేసర్కర్ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ భాజపా, శివసేన సమాన స్థానాల్లో పోటీ చేయాలని భావించాయి. అవసరమైతే మిత్ర పక్షాలకు కొన్ని సీట్లు కేటాయించాలనుకున్నాయి. కానీ సీట్ల పంపకంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోయాయి ఇరు పార్టీలు.

లోక్​సభ ఎన్నికల్లో అద్భుత ప్రదర్సన కనబర్చిన భాజపా అధిక భాగం సీట్లలో పోటీ చేయాలనుకుంటంగా.. శివసేన దానికి అంగీకరించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.

ముంబయి వర్లీ నుంచి బరిలో ఆదిత్య థాక్రే..

ఉద్దవ్ థాక్రే కుమారుడు, శివసేన నేత ఆదిత్య థాక్రే.. ముంబయిలోని వోర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ తెలిపింది.

ఇదీ చూడండి: మహా పోరు: కాంగ్రెస్​ తొలి జాబితాలో అశోక్​ చవాన్​

Last Updated : Oct 2, 2019, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details