తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు

కర్తార్​పుర్​ నడవాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్​ భావిస్తోంది. ఇందుకోసం అఠారీ- వాఘా సరిహద్దులో నేడు పాక్​ అధికారులతో మరోసారి చర్చలు జరపనుంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవాపై ఎంతమంది యాత్రికులను అనుమతించాలన్న అంశాలపై అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు

By

Published : Jul 14, 2019, 4:59 AM IST

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు
కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై నేడు భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశంకానున్నారు. పాకిస్థాన్​లోని అఠారీ-వాఘా సరిహద్దులో చర్చలు జరపనున్నారు. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై ప్రధానంగా మంతనాలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చలు జరపనున్నారు.

ఎక్కువ భాగం పాక్​లోనే

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​ అధికారులకు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి...

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019, నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం. ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించేందుకు కృషి చేస్తోంది. యాత్ర పొడవునా బలమైన భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఉపయోగించనుంది.

ABOUT THE AUTHOR

...view details