తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి రసవత్తరంగా కన్నడ రాజకీయం

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వ పరిస్థితిపై చర్చించేందుకు సిద్ధపడ్డ కొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు... తాజాగా సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ ఉపఎన్నికల వేళ ఇలాంటి  చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతాయన్న పార్టీ పెద్దల సూచనతో వెనక్కి తగ్గినట్టు సమాచారం.

కన్నడ రాజకీయాల్లో ఎమ్మెల్యేల సమావేశ దుమారం

By

Published : Apr 29, 2019, 9:41 PM IST

కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ భావ సారూప్యత ఉన్న ఎమ్మెల్యేలందరూ మంగళవారం జరిగే సమావేశానికి రావాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఎస్​టీ సోమశేఖర్​ పిలుపునిచ్చారు. అయితే ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పెద్దలు ఆయనకు సూచించినట్టు సమాచారం. ఈ తరుణంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు సోమశేఖర్​ ప్రకటించారు.

కాంగ్రెస్​ - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో చాలా కాలంగా భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. అయితే అగ్రనేతలు మాత్రం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నారు.

బెదిరింపు రాజకీయం కాదు

మంగళవారం సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే సోమశేఖర్​​. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనుండడమే ఇందుకు కారణమన్నారు.

తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడట్లేదన్నారు సోమశేఖర్​. ఎమ్మెల్యేలు నిశ్చయించిన సమావేశం ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకం కాదని తెలిపారు.

కానీ సంకీర్ణ ప్రభుత్వంతో కొందరు కాంగ్రెస్​ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇలాంటి సమావేశాలు జరిపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని... వాయిదా వేయాలని ఎమ్మెల్యేలను సీఎల్పీ నేత సిద్దరామయ్య కోరినట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details