తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల - KARNATAKA BYPOLLS SCHEDULE

కర్ణాటకలో అనర్హత వేటు పడిన 15 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. డిసెంబర్​ 5న ఈ స్థానాల్లో పోలింగ్ నిర్వహించి ఫలితాలు 9న విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు రేపటి నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.

కర్ణాటకలో ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

By

Published : Nov 10, 2019, 3:14 PM IST

కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది ఈసీ. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 9న ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ 15 నియోజకవర్గాల పరిధిలో రేపటి నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.

కర్ణాటకలో నాటి కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్​ రమేశ్ కుమార్. ఈ నేపథ్యంలో ఈ 15 స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనుంది ఈసీ.

ABOUT THE AUTHOR

...view details