వియత్నాం హనోయిలోని భారత దౌత్య కార్యాలయంలో జైపుర్ పాదం కృత్రిమ అవయవ కేంద్రాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపుర్ పాదం ప్రపంచంలో ఎంతో మంది జీవితాలను నిలబెట్టిందని కొనియాడారు.
మహాత్మగాంధీ 150 జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 'ఇండియా ఫర్ హ్యుమానిటీ' కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
"దివ్యాంగులకు జైపుర్ పాదం ఓ అద్భుత ఆవిష్కరణ. వారికి స్వేచ్ఛ, స్వతంత్రత కల్పిస్తుంది. వారు సంపూర్ణంగా జీవించేందుకు ఈ పాదం తోడ్పాటు ఇస్తుంది. భారత ప్రభుత్వం, భగవాన్ మహవీర్ దివ్యాంగుల సహాయత సమితి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కృత్రిమ అవయవ తయారీ కేంద్రం ప్రపంచలోనే అతిపెద్దది. ఈ సంస్థలు ప్రేమతో సేవలందిస్తున్నాయి."