తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ వీడి వెళ్లాలని క్రికెటర్​ ఇర్ఫాన్​ బ్యాచ్​కు ఆదేశం

జమ్ముకశ్మీర్​లో​ ఉద్రిక్తతల సెగ... ఆ రాష్ట్రంలోని క్రికెటర్లకు తాకింది. ఆ రాష్ట్ర క్రికెట్​ జట్టు కోచ్​ ఇర్ఫాన్​ పఠాన్​ సహా క్యాంపులోని ఆటగాళ్లు వెంటనే రాష్ట్రాన్ని వీడాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

కశ్మీర్​ వీడి వెళ్లాలని క్రికెటర్​ ఇర్ఫాన్​ బ్యాచ్​కు ఆదేశం

By

Published : Aug 4, 2019, 4:46 PM IST

జమ్ముకశ్మీర్​లో ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి వెంటనే వెళ్లిపోవాలని తనతో పాటు ఉన్న వంద మంది క్రికెటర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్​ జట్టు కోచ్​ ఇర్ఫాన్​ పఠాన్​ వెల్లడించాడు. ఇప్పటికే క్రికెటర్లు ఇళ్లకు తరలినట్లు చెప్పాడు.

క్రికెటర్లతో పాటు క్యాంపులోని సిబ్బందినీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పఠాన్​ తెలిపాడు.

"మా క్యాంపును మూసివేశాం. క్రికటర్లు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్యాంపు జూన్​ 14 నుంచి జులై 14 వరకు కొనసాగింది. 10 రోజుల విరామం అనంతరం మళ్లీ జులై 25న ప్రారంభమైంది. శనివారం సుమారు 100 మంది ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లారు. జులై 31-ఆగస్టు 17 వరకు మ్యాచ్​లు జరగాల్సి ఉంది. జిల్లా స్థాయి క్రికెటర్ల ఎంపిక కోసం ఈ మ్యాచ్​లు నిర్వహిస్తున్నారు."

- ఇర్ఫాన్​ పఠాన్​, భారత మాజీ క్రికెటర్

ఉగ్రముప్పు పొంచి ఉందన్న కారణంగా రాష్ట్రంలోని పర్యటకులు, అమర్​నాథ్​ యాత్రికులు కశ్మీర్​ నుంచి వెళ్లాలని ఇటీవలే ఆదేశించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కశ్మీర్​: అమిత్​షా ఉన్నత స్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details