స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణిని రాత్రి పూట పరీక్షించింది భారత సైన్యం. డీఆర్డీఓ పర్యవేక్షణలో ఒడిశాలోని బాలాసోర్ నుంచి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
చాందీపుర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజీ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఓ మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించారు. చివరిసారిగా 2019 నవంబర్ 20న పృథ్వీ క్షిపణిని చీకటిలో పరీక్షించినట్లు చెప్పారు.