తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాకు కొత్త చికిత్స గుర్తించిన భారత శాస్త్రవేత్తలు

కరోనా మహమ్మారి చికిత్సలో ఇప్పటి వరకు పలు ఔషధాలు గుర్తించి వినియోగించారు. అయితే.. అవి అంతగా ప్రభావం చూపలేకపోయినట్లు పలు పరిశోధనలు తేల్చాయి. తాజాగా తమిళనాడు అలగప్ప విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు.. వైరస్ రూపాంతరం చెందుతున్నప్పటికీ నిర్దష్ట లక్ష్యంతో​ ప్రోటీన్లపై దాడి చేసే సామర్థ్యం గల పలు ఔషధాలను గుర్తించారు.

Covid treatment
కరోనా చికిత్సకు కొత్త డ్రగ్స్​

By

Published : Dec 10, 2020, 1:27 PM IST

కరోనా వైరస్ కీలక​ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల సామర్థ్యం ఉన్న కొత్త ఔషధాలు, కాక్​టెయిల్స్​ను గుర్తించారు భారత శాస్త్రవేత్తలు. అవి కొవిడ్​-19 చికిత్సలో ఎంతో ఉపయోగపడనున్నాయని తెలిపారు. తమిళనాడులోని అలగప్ప విశ్వవిద్యాలయం, కేటీహెచ్​ రాయల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ, స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. పలు ఔషధాలు, కాక్​టెయిల్స్​ను కొవిడ్​-19 చికిత్సలో పరీక్షించేందుకు ప్రతిపాదించారు.

డ్రగ్​బ్యాంక్​ డేటాబేస్​ వర్చువల్​ స్క్రీనింగ్​ను ఉపయోగించి.. సార్స్​ కోవ్​-2 వైరస్​ రూపాంతరం చెందుతున్నప్పటికీ వైరస్ ప్రోటీన్లపై దాడిచేసే కొత్త మార్గాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన సైంటిఫిక్​ రిపోర్ట్స్ జర్నల్​లో ప్రచురితమైంది.

" కరోనా వైరస్​ వేగంగా రూపాంతరం చెందుతుంది. అంటే అది తన ప్రోటీన్స్​ను మార్చుతోందని అర్థం. మన దగ్గర ఉన్న ఔషధం పలు ప్రోటీన్లను టార్గెట్​ చేసుకుంటే.. కరోనా వైరస్​ రూపాంతరం చెందిన క్రమంలో అది ఇతర ప్రోటీన్లపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే కాక్​టెయిల్స్​ లేదా ఔషధాల మిశ్రమాలను ప్రతిపాదించటం మాకు సాధ్యమైంది. దీనిలో ప్రతి డ్రగ్​ ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రోటీన్​పై ప్రభావం చూపుతుంది. "

- వైభవ్​ శ్రీవాస్తవ, శాస్త్రవేత్త

ఈ పరిశోధన.. ఒక కాక్​టెయిల్​ సహా బలోక్సవిర్​ మార్బోక్సిల్​, నటమైసిన్​, ఆర్​యూ-85053ను చికిత్స కోసం పరీక్షించేందుకు ప్రతిపాదించింది. వాటితో పాటు టివాంటినిబ్​, ఒలాపరిబ్​, జొలిప్లోడసిన్​, గోల్వాటినిబ్​, సోనిడేగిబ్​, రిగొరేఫెనిబ్​, పీసీఓ-371 వంటి ఔషధాలను సూచించింది. ఇవి వైరస్​లోని 3సీఎల్​, పపేయిన్​, ఆర్​డీఆర్​పీ వంటి మూడు ప్రోటీన్లపై కచ్చితత్వంతో దాడి చేస్తున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ ఔషధాలు కరోనాతో పాటు ఇతర హెచ్​ఐవీ వంటి వైరల్​ రోగాల చికిత్సల్లో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు శాస్త్రవేత్తలు. హైడ్రాక్సీక్లోరోక్విన్​ వంటి ఔషధాలు ఎక్కవ ప్రభావం చూపకపోవటానికి కారణం.. అవి నిర్దిష్ట వైరల్​ ప్రోటీన్లపై దాడి చేయలేకపోవటమేనని తెలిపారు.

ఇదీ చూడండి: కరోనానా..? ఆ ఊసే లేదక్కడ!

ABOUT THE AUTHOR

...view details