భారత్, అమెరికా మూడో దఫా 2+2 చర్చలు దిల్లీలో అక్టోబర్ 27న జరగనున్నట్లు విదేశాంగా శాఖ (ఎంఈఏ) తెలిపింది. రక్షణ, భద్రత, అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది.
చర్చల్లో పాల్గొనడానికి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్.. అక్టోబర్ 26న భారత్కు రానున్నట్లు ఎంఈఏ తెలిపింది. భారత ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.
నిఘా, సైనిక రంగాల్లో..
ఈ సదస్సులో నిఘా, సైనిక వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని విస్తరణకు మార్గం సుగమం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బేసిక్ ఎక్స్చేంజి అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీఈసీఏ)ను ఖరారు చేసే అవకాశం ఉంది. బీఈసీఏ ద్వారా ఇరు దేశాల మధ్య అత్యంత అధునాతన సైనిక సాంకేతికత, రవాణా, భౌగోళిక మ్యాపుల మార్పిడి సాధ్యమవుతుంది.
చైనా దూకుడుపై..