అక్టోబరు 2 నుంచి ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని భారత్‌లో నిషేధిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు భారీ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు మోదీ. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గతంలోనూ చెప్పినట్లు గుర్తు చేశారు.
"నేను ఇక్కడకు వస్తున్నపుడు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వాడరాదనే నినాదాలను ఐక్యరాజ్యసమితి భవనాల గోడలపై చదివాను. ఇప్పటికే భారత్‌ను ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ నుంచి విముక్తి కల్పించేందుకు భారీ కార్యాచరణ అమలు చేస్తున్నాం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని.