తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాకు 'గ్లోబల్​ హబ్​'గా భారత్​!

రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్​తో భారత్​ పోటీపడుతోంది. గత వారంలో రోజువారీ కేసుల సగటు ఆయా దేశాల్లో కన్నా భారత్​లోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇదే కొనసాగితే వైరస్​ హబ్​గా భారత్​ నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

India inches closer to become global hub of coronavirus
కరోనా కేసుల్లో అమెరికాను దాటేయనున్న భారత్​!

By

Published : Aug 17, 2020, 3:29 PM IST

ఒకప్పుడు అమెరికా, ఇటలీలో రోజువారీ కేసుల సంఖ్యను చూసి ప్రపంచం బెంబేలెత్తిపోయింది. చూస్తుండగానే బాధితుల సంఖ్య విషయంలో అమెరికా అగ్రస్థానానికి చేరుకుంది. ఆ వెంటే బ్రెజిల్​ నిలిచింది. కానీ ఇప్పుడు అందరి చూపు భారత్​పైనే. కరోనా కట్టడిలో ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న దేశం.. ఇప్పుడు రోజువారీ కేసుల రేసులో అమెరికా, బ్రెజిల్​ను వెనక్కి నెడుతోంది. ఇదే కొనసాగితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజువారీ కేసుల్లో...

దేశంలో సోమవారం ఒక్కరోజులో 57,982 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 941మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 26,47,664కి చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50,921కి పెరిగింది. అమెరికాలో ఇప్పటివరకు 55,67,765.. బ్రెజిల్​లో 33,40,197 కేసులు నమోదయ్యాయి.

కానీ దేశంలో కరోనా కేసులు గత వారం నుంచి ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వారం రోజుల పాటు... రోజువారీ కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్​ కన్నా భారత్​ ముందు వరుసలో నిలిచింది. ప్రతిరోజు సగటున 60వేల కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంఖ్య.. అమెరికా, బ్రెజిల్​ కన్నా చాలా ఎక్కువ.

ఇదీ చూడండి:-ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో 90 మందికి కరోనా

అమెరికాలో కేసులు తగ్గుతున్నాయి. బ్రెజిల్​లో బాధితుల సంఖ్య నిలకడగా ఉంది. కానీ భారత్​లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా.. వారం రోజుల సగటులో భారత్​ అగ్రస్థాంలో నిలిచింది. పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే.. రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని స్పష్టమవుతోంది.

రెట్టింపు శాతంలోనూ...

దేశంలో వైరస్​ కేసుల రెట్టింపు శాతం కూడా భయానకంగా ఉంది. ప్రతి 24 రోజులకు కేసులు రెట్టింపవుతున్నాయి. ఈ విషయంలోనూ భారత్​కు.. బ్రెజిల్​(47రోజులు), అమెరికా(65) మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

కేసుల 'రికార్డు...'

నిజానికి కరోనా కట్టడి విషయంలో భారత్​కు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఎన్నో దేశాలకు భారత్​ ఆదర్శంగా నిలిచింది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

ఇదీ చూడండి:-ఇకపై లాలాజలం నమూనాతో కరోనా నిర్ధరణ!

అమెరికాలో జులై 22న ఒక్కరోజే అత్యధికంగా 67 వేల కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు ఇదే రికార్డు. భారత్​లో గత గురువారం 66,999 కేసులు నమోదయ్యాయి. ఇంకా వైరస్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టకపోవడం వల్ల అమెరికా రికార్డును అతి త్వరలోనే భారత్​ అధిగమిస్తుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే భారత్​ కరోనా వైరస్​ హబ్​గా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

రికవరీల్లోనూ రికార్డు...

దేశంలో కేసుల సంఖ్యతో పాటు రికవరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 57,584మంది బాధితులు కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 19,19,842 మంది(72శాతంపైనే) కోలుకున్నారు.

3 కోట్ల పరీక్షలు...

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 3 కోట్లు దాటింది. ఆదివారం నాటికి మొత్తం మీద 3,00,41,400మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎమ్​ఆర్​(భారత వైద్య పరిశోధన మండలి) ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే 7,31,697 పరీక్షలు నిర్వహించినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:-మహమ్మారి నేర్పిన సైకిల్‌ సవారీ

ABOUT THE AUTHOR

...view details