తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్-చైనాలు దౌత్య, సైనిక సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాత్సవ. ఇరు దేశాల నాయకుల మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఓ ఒప్పందానికి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
'వీలైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం'
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాత్సవ. రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
'వీలైనంత త్వరగా సరిహద్దు సమస్య పరిష్కారం'
లద్దాఖ్ సరిహద్దులో గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్ సహా పలు ప్రాంతాల్లో భారత్, చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు శ్రీ వాత్సవ. సరిహద్దులో ప్రశాంత వాతావరణం ఉంటేనే భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు.
సైన్యం అధికారిక వర్గాలు మాత్రం సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపాయి. చైనా దళాలు 1.5కి.మీ వెనక్కి వెళ్లినట్లు పేర్కొన్నాయి.