జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో సారి తన అక్కసు వెళ్లగక్కారు. ఐక్య రాజ్య సమితి సహా ప్రపంచ వేదికలన్నింటిపై కశ్మీర్ తరపున తన గొంతుకను వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు స్పందించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒక వేళ భారత్-పాక్‌ల మధ్య యుద్ధం వస్తే దానికి అంతర్జాతీయ సమాఖ్యలే బాధ్యత వహించాలన్నారు.
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్రాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.