తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా నాన్నలా అవ్వొద్దు.. భోంచేసి హెల్మెట్ తీసుకెళ్లండి'

కర్ణాటకలో ఓ బాలుడు ఉచితంగా శిరస్త్రాణాలను పంపిణీ చేశాడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయాల్లో తప్పక ధరించండని వేడుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

By

Published : Aug 8, 2019, 3:52 PM IST

మా నాన్నలా అవ్వొద్దు.. భోంచేసి హెల్మెట్ తీసుకెళ్లండి!

మా నాన్నలా అవ్వొద్దు.. భోంచేసి హెల్మెట్ తీసుకెళ్లండి

కర్ణాటక హుబ్లీ జిల్లాకు చెందిన ఓ బాలుడి రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు. మరొకరు అలా కాకూడదని శిరస్త్రాణాలను ఉచితంగా అందిస్తున్నాడు. హెల్మెట్​ ధరించని కారణంగా తన తండ్రిలా ఇంకెవరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందకూడదని వినూత్నంగా ఆలోచించాడు.

తండ్రి కర్మకాండల కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు, ఇరుగుపొరుగు వారందరికీ ఉచితంగా హెల్మెట్​ పంపిణీ చేశాడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయాల్లో తప్పక ధరించాలని సూచిస్తున్నాడు.

బాలుడి తండ్రి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్​ ధరించనందున తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడు.

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

ABOUT THE AUTHOR

...view details