తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్: నేటి నుంచి తెరుచుకోనున్న ఉన్నత పాఠశాలలు

జమ్ము కశ్మీర్​లో క్రమకమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కశ్మీర్​లోయలో ఆంక్షలను ఎత్తివేసిన ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు, దుకాణాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.

కశ్మీర్: నేటి నుంచి తెరుచుకోనున్న ఉన్నత పాఠశాలలు

By

Published : Aug 28, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 1:29 PM IST

కశ్మీర్: నేటి నుంచి తెరుచుకోనున్న ఉన్నత పాఠశాలలు
కశ్మీర్‌లోయలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో నేటి నుంచి ఉన్నత పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకోనున్నాయి.

లోయలో ఇప్పటివరకూ 3,037 ప్రాథమిక పాఠశాలలు, 774 ప్రాథమికోన్నత పాఠశాలలు తెరిచినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయుల శాతం పెరుగుతోందన్న అధికారులు, విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

81 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల రాకపోకలపై ఆంక్షలను సడలించారు అధికారులు. గురువారం నుంచి మరో 10 ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రానికి మరో 15 టెలిఫోన్​ ఎక్ఛేంజ్‌లలో ల్యాండ్‌లైన్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

Last Updated : Sep 28, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details