తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విద్వేష ప్రసంగాల'పై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు - దిల్లీ హైకోర్టు వార్తలు

విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన దిల్లీ హైకోర్టు.. కేంద్రం, కేజ్రీవాల్ ప్రభుత్వంతోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసుల నమోదుకు సంబంధించి స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది.

delhi
దిల్లీ హైకోర్టు

By

Published : Feb 28, 2020, 1:46 PM IST

Updated : Mar 2, 2020, 8:43 PM IST

'గాంధీ' కుటుంబ సభ్యులు విద్వేష ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై కేంద్రంతో పాటు కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన కోరింది దిల్లీ హైకోర్టు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై ఈ మేరకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వంతోపాటు స్థానిక పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

వీరితో పాటు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్​, ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్​ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వారీస్​ పఠాన్​లపైనా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపైనా సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

ఇదిలా ఉంటే విద్వేష ప్రసంగాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​)ను ఏర్పాటు చేయాలని మరో వ్యాజ్యం దాఖలైంది.

Last Updated : Mar 2, 2020, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details