తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టోల్​ ఉద్యోగిని 8కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

హరియాణా గురుగ్రామ్​లోని ఖేర్కి డౌలా టోల్​ గేట్​ వద్ద అమానుష సంఘటన జరిగింది. టోల్​ రుసుము వసూలు చేసేందుకు యత్నించిన ఉద్యోగిని ఓ ఇన్నోవా కారు డ్రైవర్​ ఎనిమిది కిలోమీటర్లు కారుపైనే లాక్కెళ్లాడు. అనంతరం బెదిరించి విడిచిపెట్టాడు.

టోల్​ ఉద్యోగిని 8కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

By

Published : Apr 14, 2019, 8:34 AM IST

Updated : Apr 14, 2019, 10:48 AM IST

టోల్​ ఉద్యోగి పట్ల డ్రైవర్​ దారుణం

ఎప్పుడైనా టోల్​గేట్​ దగ్గర ఏం చేస్తాం? మన వాహనాన్ని బట్టి రుసుము కట్టి వెళ్లిపోతాం. కానీ ఓ కారు డ్రైవర్​ టోల్​ రుసుము కట్టకపోగా... అక్కడున్న ఉద్యోగిని కారుపైనే లాక్కెళ్లాడు. హరియాణా గురుగ్రామ్​లో జరిగిన ఈ ఘటన అందరినీ నివ్వెరపరిచింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అశోక్​ కుమార్​ అనే ఉద్యోగి ఖేర్కి డౌలా టోల్​ గేట్​ వద్ద రుసుము కోసం ఓ ఇన్నోవా కారును ఆపేందుకు ప్రయత్నించాడు.

కానీ... కారులోని డ్రైవర్​ అతడ్ని పట్టించుకోకుండా అశోక్​ కుమార్​ను వేగంగా ఢీ కొట్టాడు. ఆ ఉద్యోగి కారుపైనే పడిపోయాడు. డ్రైవర్​ అలాగే దాదాపు 8 కిలోమీటర్లు కారును వేగంగా నడిపాడు. అనంతరం మనేసర్​ ప్రాంతంలో కారు ఆపి అశోక్​ కుమార్​పై దాడికి యత్నించారు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. ఈ మొత్తం తతంగం సీసీ కెమెరాల్లో రికార్డయింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 'మోదీ డూప్​'కు ఎన్నికల సంఘం నోటీసులు

Last Updated : Apr 14, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details