తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు జీఎస్టీ మండలి 36వ సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో జీఎస్టీ మండలి 36వ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సభ్యులతో మాట్లాడనున్నారు మంత్రి.

జీఎస్టీ మండలి సమావేశం

By

Published : Jul 25, 2019, 7:31 AM IST

జీఎస్టీ మండలి సమావేశం

జీఎస్టీ మండలి 36వ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరగనున్న తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే.

పన్ను రేట్ల సవరణ!

ఈ సమావేశంలో విద్యుత్తు వాహనాలు, సోలార్ పవర్ ప్రాజెక్టులపై పన్ను తగ్గింపు, లాటరీలపై జీఎస్టీ రేట్ల సవరణ వంటి నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. బడ్జెట్‌లో విద్యుత్‌ వాహనాలపై రాయితీలను ప్రకటించారు ఆర్థిక మంత్రి. కొన్ని రకాల విడిభాగాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు.

ఈసారి సమావేశంలో విద్యుత్తు వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తారని భావిస్తున్నారు. లాటరీలపై అటార్ని జనరల్ సలహా తీసుకుని పన్ను రేట్లను సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే లాటరీలపై 12శాతం, ప్రభుత్వ గుర్తింపుతో నడిచే లాటరీలపై 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు.

ఇదీ చూడండి: లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం!

ABOUT THE AUTHOR

...view details