రైళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు మహారాష్ట్ర ఇంధన మంత్రి తెలిపారు. అత్యవసర సేవలైన ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
ముంబయిలో పవర్ కట్- శరవేగంగా పునరుద్ధరణ పనులు - ముంబయిలో గ్రిడ్ విఫలం
13:10 October 12
12:43 October 12
ముంబయిలో పవర్ కట్- శరవేగంగా పునరుద్ధరణ పనులు
ముంబయి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. టాటా సంస్థకు చెందిన గ్రిడ్ దెబ్బతినడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు బృహన్ ముంబయి తెలిపింది. ముంబయి తూర్పు, పడమర, ఠానే సహా పలు ప్రాంతాలు కొన్ని గంటలుగా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల సబర్బన్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే విద్యుత్ పునరుద్ధరణ పనులను శరవేగంగా చేస్తున్నారు అధికారులు.
ఠాక్రే ఆదేశం...
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే... ఇంధన శాఖ మంత్రి, బీఎంసీ కమిషనర్‌తో దీనిపై చర్చించారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
అంధకారంలో...
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ముంబయిలో కార్యకలాపాలు స్తంభించాయి. అసౌకర్యానికి చింతిస్తున్నామని విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ బెస్ట్ ట్వీట్ చేసింది.
గ్రిడ్ వైఫల్యంతో ముంబయితో పాటు పరిసర ఠానే, పాల్ఘడ్,రాయ్‌గఢ్ జిల్లాల్లోను విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు విద్యుత్ వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సబర్బన్ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కల్వా 400 కేవీ విద్యుత్ కేంద్రంలో నిర్వహణ పనులు చేపడుతుండగా సాంకేతిక లోపం తలెత్తిందని మహారాష్ట్ర ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ తెలిపారు. సమస్యను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
యథావిధిగా మార్కెట్లు...
అయితే ఆ ఎలక్ట్రిక్ లైన్‌ను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. ఎమ్ఐడీసీ, పాల్ఘర్ లైన్లో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబయి నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ ఎక్సేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మాత్రం ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్ ఆగిపోవడం ఇదే తొలిసారని పలువురు తెలిపారు.
ట్రెండింగ్...
మరోవైపు అదానీ ఎలక్ట్రిసిటీ నుంచి సైతం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. త్వరలోనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరిస్తామని సంస్థ తెలిపింది. అప్పటి వరకు ఏఈఎమ్ఎల్ నుంచి అత్యవసర సేవలకు కావాల్సిన విద్యుత్ అందనుందని వెల్లడించింది. విద్యత్తు సరఫరా నిలిచిపోయిన కొన్ని క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. పవర్‌కట్, ముంబయి, పవర్‌ఔటేజ్ వంటి హాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.