తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నైలో యువతిని బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ​

రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ ఓ యువతి మృతికి కారణమైంది. చెన్నైలో ఫ్లెక్సీ తగిలి స్కూటీపై ప్రయాణిస్తున్న యువతి కిందపడిపోయింది. ఆమెపై నుంచి వాటర్​ ట్యాంకర్​ దూసుకెళ్లింది.

మృతి చెందిన శుభశ్రీ

By

Published : Sep 13, 2019, 1:00 PM IST

Updated : Sep 30, 2019, 10:56 AM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. రహదారిపై అక్రమంగా పెట్టినఫ్లెక్సీ తెగిపోయి​ మీద పడటం వల్ల 23 ఏళ్ల యువతి మరణించింది. పల్లవరం-తొరైపాకం రహదారిలో బైక్​పై ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

పడిపోయిన స్కూటీ

పరీక్ష రాసి వెళుతుండగా..

ఓ పరీక్షకు హాజరైన శుభశ్రీ.. స్కూటీపై ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో అదే రహదారిలో ఉన్న అన్నాడీఎంకే కార్యకర్త కుటుంబ కార్యక్రమానికి సంబంధించినఫ్లెక్సీ ఆమెపై పడింది. ఆ యువతి అదుపుతప్పి కిందపడిపోయింది. పక్కనుంచి వెళుతున్న ఓ వాటర్​ ట్యాంకర్​ శుభశ్రీ పైనుంచి దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

మృతి చెందిన శుభశ్రీ

కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం.. శుభశ్రీ ఐఈఎల్​టీఎస్​ పరీక్షకు హాజరై వస్తోంది. పై చదువులకోసం కెనడా వెళ్లాలన్నది ఆమె కోరిక.

శుభశ్రీ

నిషేధం ఉన్నా..

ఫ్లెక్సీలపై రెండేళ్ల క్రితమే మద్రాస్​ హైకోర్టు నిషేధం విధించింది. అధికార పార్టీకి చెందినవారే కోర్టు ధిక్కారానికి పాల్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

Last Updated : Sep 30, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details