'సార్వత్రికం' 4వ దశలో ధన ప్రవాహం సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. కేవలం నాలుగో విడత ఎన్నికల్లో మాత్రమే పట్టుకున్న మొత్తం అక్రమ సొమ్ము, ఇతర వస్తువుల విలువ అక్షరాలా రూ. 3274.18 కోట్లు.
ఎన్నికల పరిశీలకులు విస్తృత సోదాలు చేసి డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
లెక్కలివిగో...
⦁ రూ. 249.038 కోట్ల మద్యం
⦁ రూ. 1214.46 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు
⦁ రూ. 972 కోట్ల విలువైన ఆభరణాలు
⦁ రూ. 53. 167 కోట్ల ఇతర తాయిలాలు
ఈ లెక్కలు తేల్చేందుకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 72 లోక్సభ నియోజక వర్గాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో 97మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది ఈసీ. ఎన్నికల వ్యయం ఎక్కువగా ఉంటుందనుకునే నియోజకవర్గాల్లో ఇద్దరేసి చొప్పున పరిశీలకులు పని చేసినట్లు తెలిపింది. వీరికి తోడుగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నిఘా బృందాలు, సీసీ కెమెరాలతో నిఘా వంటి విభాగాల్లో 6, 251 మంది వారికి సహకరించారని పేర్కొంది.
ఇదీ చూడండి: నవ వధువుల కోసం ప్రత్యేక డిజైన్లు