తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాలిలోనూ స్వాహా..!

సాధారణంగా దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో చేతివాటం చూపిస్తారు. అయితే విమానాల్లోనూ దొంగతనాలు జరుగుతుండటం చూసి అధికారులు నిర్ఘాంతపోయారు.

ఎయిర్​ ఇండియా

By

Published : Mar 4, 2019, 8:07 PM IST

ఇది వరకు ఆకలేస్తే ఆహారాన్ని దొంగిలించేవారు....నేడు రుచి చూడటం కోసం దొంగిలిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆహారాన్ని చేరవేసే ఓ సంస్థ డెలివరీ ఉద్యోగి దారి మధ్యలో వినియోగదారునికి ఇవ్వాల్సిన ఆహారాన్ని స్వాహా చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఇదే తరహా ఘటన ఎయిర్​ ఇండియా విమానంలో చోటుచేసుకుంది.

ఎయిర్​ ఇండియాకు చెందిన నలుగురు ఉద్యోగులు ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను దర్జాగా ఆరగించారు. విమానాల్లోని వంట సామాగ్రిని ఇంటికి తీసుకెళుతున్నారు. ఎట్టకేలకు వీరి దోపిడి అధికారుల కంట పడింది. అంతే చకచకా నలుగురు ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అధికారులు.
విమానాల్లోని సిబ్బంది, గ్రౌండ్​ సిబ్బంది ప్రయాణికుల ఆహారం ముట్టరాదని 2017 లోనే అంతర్గత నోటిసు జారీ చేసింది ఎయిరిండియా. ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరించింది.

పట్టుబడ్డ నలుగురిలో ఇద్దరు క్యాటరింగ్,​ మరో ఇద్దరు క్యాబిన్​ క్రూ ఉద్యోగులు. వీరు మిగులు ఆహార పదార్థాలని, వంటసామాగ్రిని దొంగిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంతకుముందే :

విమానాల్లో ఆహార దోపిడి ఇదే మొదటి సారి కాదు. ఇద్దరు క్యాబిన్​ క్రూ ఉద్యోగులు దిల్లీ-సిడ్నీ విమానంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి హెచ్చరిక జారీ చేసింది సంస్థ. అంతర్జాతీయ సర్వీసుల నుంచి వారిని తప్పించి దేశీయ సర్వీసులకు పరిమితం చేశారు.

ABOUT THE AUTHOR

...view details