కొందరు అతిగా వాదించేవారికి పాక్‌లోని బాలాకోట్, జమ్ముకశ్మీర్‌లోని బాలా కోటె ప్రాంతాలకు మధ్య తేడా తెలియదని విమర్శించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. కొత్తగా బాలాకోట్‌ను కనుగొన్నారని ఎద్దేవ చేశారు.
‘'మన్ కీ బాత్... రేడియో ద్వారా ఓ సామాజిక విప్లవం'’ పేరిట రాసిన ఓ పుస్తకాన్ని ఆయన శనివారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.
పాక్‌లోని ఖైబర్-పఖ్తున్‌ఖవా ప్రావిన్సు బహవాల్‌పూర్ సమీపంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడి చేసిందని తెలిపారు. దానిపై ఎలాంటి సమాచారం అందకముందే, కొందరు ఆ బాలాకోట్ నియంత్రణ రేఖ వద్ద ఉందని అసత్య ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు.
బాలాకోట్ ప్రాంతంపై తప్పుడు ప్రచారం చేశారని అరుణ్‌జైట్లీ ఆరోపణ
"మన వాయుసేన పీఓకేలోని బాలాకోట్‌లో దాడులు చేస్తే ఎలాంటి సమాచారం అందకముందే నియంత్రణ రేఖకు సమీపంలో బాలాకోట్ ఉందని ప్రచారం చేశారు. కొందరు అతిగా వాదించేవారు కొత్తగా బాలాకోట్ ప్రాంతాన్ని కనుగొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండానే మన పూంచ్ సెక్టార్‌లోనే బాలాకోట్ ఉందని ప్రచారం చేశారు. మన భూభాగంపై మన దళాలే ఎందుకు దాడి చేస్తాయి?’"- అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
భారత్‌లో బాలాకోటె
‘బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరం’పై దాడి చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని అజ్మతాబాద్, రాజౌరీకి సమీపంలో బాలా కోటె ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంపై గందరగోళం తలెత్తింది. తర్వాత పాక్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది.