తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం వరదల్లో 96కు చేరిన మృతులు

అసోం వరదల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 96కి చేరింది. రాష్ట్రంలో పరిస్థితిపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆరా తీశారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా అసోంలో 26 జిల్లాల్లోని 28లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు.

Flood death toll reach 96 in Assam
అసోం వరదల్లో 96కు చేరిన మృతులు

By

Published : Jul 25, 2020, 5:05 AM IST

భారీ వర్షాల వల్ల అసోం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మరో ముగ్గురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 96కు చేరింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మొత్తం 33 జిల్లాలకు గాను 26 జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 28 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1.22లక్షల హెక్టార్ల పంటనష్టం జరిగింది.

అసోం వరదలు
అసోం వరదలు

అసోంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. వరద బాధితులకు సంఘీభావం తెలిపారు.

అసోం వరదలు

బిహార్​లో 10లక్షల మంది...

బిహార్​లోనూ వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గండక్​ నది పొంగిపొర్లుతోంది. ఈ ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో వరదల కారణంగా ప్రభావితమైన వారి సఖ్య 10లక్షలకు పెరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భారత భూభాగం వైపు నేపాల్ కాల్పులు.. సరిహద్దులో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details