ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో అగ్నిప్రమాదం జరిగింది. ఏశ్బాగ్ ప్రాంతంలోని దోబీఘాట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు వెంటనే మంటలను ఆర్పివేశాయి.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో 50-60 గుడిసెలు ఉన్నాయని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.