దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 26 అగ్నిమాపక యంత్రాలలో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు సహాయక సిబ్బంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రవాణాశాఖ కార్యాలయంలో మంటలు.. కీలక పత్రాలు దగ్ధం
దిల్లీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 26 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో రవాణాాాశాఖకు సంబంధించిన పత్రాలన్నీ దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
దిల్లీ రవాణశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
అయితే.. ఈ ఘటనలో రవాణా శాఖకు సంబంధించిన కీలక పత్రాలన్నీ దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు దిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్.
ఇదీ చూడండి: మరికాసేపట్లో భాజపా అధ్యక్ష పదవికి 'నడ్డా' నామినేషన్