తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ట్రాఫిక్​ జరిమానాలు మాఫీ!'

ఎన్నికల ప్రచారంలో 'ఉచిత' హామీలు ఇచ్చిన అభ్యర్థుల్ని ఎందరినో చూశాం. అయితే... 'అంతకుమించి' అంటున్నారు హరియాణాలోని ఫతేహాబాద్​ భాజపా అభ్యర్థి.

'ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ట్రాఫిక్​ జరిమానాలు మాఫీ!'

By

Published : Oct 10, 2019, 4:09 PM IST

Updated : Oct 10, 2019, 7:07 PM IST

'ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ట్రాఫిక్​ జరిమానాలు మాఫీ!'

"ద్విచక్ర వాహనదారుడికి రూ.30వేలు జరిమానా... ఆటో డ్రైవర్​కు రూ.55వేలు ఫైన్​... లారీ డ్రైవర్​కు రూ.2లక్షలు చలానా!"... మోటరు వాహనాల కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న వార్తలు. భారీ జరిమానాలకు భయపడి కొందరు సొంత వాహనాలు వాడడం తగ్గించేశారు కూడా. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు ఓ రాజకీయ నేత.

హరియాణా ఫతేహాబాద్​ శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేస్తున్న దూదారామ్​ బిష్ణోయ్​... ఓటర్లకు ఓ విచిత్ర హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే... ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించినా చలానా రాకుండా చూస్తానని చెప్పారు.

"నన్ను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. మాదక ద్రవ్యాల కట్టడి, విద్య, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్​ చలానాలు వంటి చిన్నచిన్న సమస్యలు రాకుండా చూసుకుంటా."

-దూదారామ్​ బిష్ణోయ్​, భాజపా అభ్యర్థి.

దూదారామ్ వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్​ అయ్యాయి. హరియాణాలోని 90 శాసనసభ నియోజకవర్గాలకు ఈనెల 21న పోలింగ్​. 24న ఎన్నికల ఫలితం వెలువడనుంది.

ఇదీ చూడండి : కేంద్ర ఆర్థికమంత్రికి పీఎంసీ బాధితుల నిరసన సెగ

Last Updated : Oct 10, 2019, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details