ఈ ఉల్లిపాయలు తింటే కరోనా దరిచేరదట! చిన్న ఉల్లిపాయలు తింటే కరోనా వైరస్ దరిచేరదని తమిళనాడు కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని చెబుతున్నారు. ఇది తమిళ సంప్రదాయ వైద్య పద్ధతి అని ఆయన తెలిపారు. తమ హోటల్‌కు వచ్చిన వారికి కచ్చితంగా ఈ చిన్న ఉల్లిని అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ అంటువ్యాధి వలన చైనాలో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. 17 వేలమందికి పైగా ఈ వైరస్ సోకింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ... అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితినీ ప్రకటించింది.
భారత్‌కు చేరిన కరోనా
భారత్‌కు సంబంధించి కేరళలో ఇప్పటి వరకు రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు చైనాలో చదువుకుంటున్న విద్యార్థి కాగా, మరొకరు చైనాకు స్వవిషయమై పయనమై వచ్చినవారు.
వంటింటి వైద్యం!
ఇలాంటి పరిస్థితుల్లో వంటింటి వైద్యం సూచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ తమిళ హోటల్ యాజమాన్యం. కేవలం చిన్న ఉల్లిపాయలు తినడం వల్ల కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని, ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది శాస్త్రవేత్తలే తెలియజేయాలి.
ఇదీ చూడండి: మెక్సికో: అది మ్యూజియమా.. డాన్ స్థావరమా!