తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సుల్లో అగ్ని ప్రమాదాలకు ఇలా చెక్! - drdo projects

తరచూ బస్సుల్లో జరిగే అగ్ని ప్రమాదాలకు చెక్​ పెట్టే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) నూతన పరిజ్ఞానంతో ముందుకు వచ్చింది. మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లో ఆర్పివేసే సాంకేతికతను రూపొందించింది.

DRDO developed fire detection and suppression system to check fire accidents in buses
బస్సుల్లో అగ్ని ప్రమాదాలకు ఇక చెక్​.!

By

Published : Nov 9, 2020, 8:31 PM IST

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయాణికుల బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ-డీఆర్​డీవో అభివృద్ధి చేసింది. ఫైర్‌ డిటెక్షన్ అండ్‌ సర్‌ప్రెస్‌ సిస్టమ్‌-ఎఫ్​డీఎస్​ఎస్​ పేరుతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానం అమరిస్తే.. బస్సులో మంటలు అంటుకున్న 30 సెకన్లలోనే గుర్తించి మరో 60 సెకన్లలోనే అర్పేస్తుందని డీఆర్​డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.

దిల్లీలోని డీఆర్​డీవో భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం పనితీరు ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరిశీలించారు. ఎఫ్​డీఎస్​ఎస్ పనితీరుకు సంబంధించి నిపుణుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కోసం నీటి పొగమంచు ఆధారిత ఎఫ్​డీఎస్​ఎస్ సహా ఇంజిన్ ఫైర్ కోసం ఏరోసెల్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వాడినట్టు డీఆర్​డీవో వర్గాలు వివరించాయి. ఎఫ్​డీఎస్​ఎస్ కాంపార్ట్‌మెంట్‌లో 80 లీటర్ల సామర్థ్యం గల నీటి తొట్టి, 6.8 కిలోల నైట్రోజన్‌ సిలిండర్‌ ఉంటుందన్నారు. ఎఫ్​డీఎస్​ఎస్ ఏరోసల్‌ ఆధారిత సాంకేతికత ఉండే జెనరేటర్‌ 5 సెకన్లలో మంటలను ఆర్పుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: దీపావళికి స్వదేశీ వస్తువులే కొనండి: మోదీ

ABOUT THE AUTHOR

...view details