తమిళనాడులో నీటి సంక్షోభంపై ద్రవిడ మున్నేట్ర కళగమ్ (డీఎంకే) పార్టీ ఆందోళనకు దిగింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరి నిరనసలు చేపట్టారు పార్టీ శ్రేణులు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం
తమిళనాడులో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఆందోళన బాట పట్టింది. అధినేత స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఖాళీ బిందెలతో రోడ్ల నిరసనలు చేపట్టింది.
నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం
చెపాక్‌లో చేపట్టిన నిరసనల్లో డీఎంకే అధినేత స్టాలిన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదని లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ గాయం.. తీసింది ప్రాణం