లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి ప్రదర్శనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునేందుకు కూటమిపై ఆధారపడొద్దని పార్టీ నాయకులకు సూచించడమే ఇందుకు నిదర్శనం.
దిల్లీలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర్ప్రదేశ్ విభాగం నాయకులతో సమావేశమయ్యారు మాయావతి. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూటమిపై ఆధారపడకుండా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయ అధికారులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.