తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'

కర్ణాటకలో సాటి శునకానికి రక్తదానం చేసి సహృదయాన్ని చాటుకున్నాడు 'రానా'. యజమాని బాటలో నడుస్తూ.. మారు మాట్లాడకుండా ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్న కుక్క వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

Dog donated blood to another which was suffering from jaundice in karnataka dharwad
రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'

By

Published : Jan 17, 2020, 2:04 PM IST

Updated : Jan 17, 2020, 6:33 PM IST

రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'

రోట్​వీలర్​ జాతికి చెందిన రానా.. అదే జాతికి చెందిన శునకం 'రోటీ'కి రక్తదానం చేశాడు. సాటి శునకం ప్రాణాలు కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు.
కర్ణాటక ధార్వాడ్​లోని 'సుందర సిటీ' ప్రాంతానికి చెందిన మనీశ్ కులకర్ణి పెంచుకుంటున్న గారాల శునకం పేరు రానా. రానా చాలా తెలివైన, విశ్వాసమైన శునకం. అందుకే యజమాని చెప్పగానే మారాం చేయకుండా సాటి శునకానికి సాయం చేశాడు.

ధార్వాడ్​కు చెందిన గణేశ్ పెంపుడు కుక్క 'రోటీ'​ గత కొన్ని రోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. రోటీకి రక్త కణాల శాతం తగ్గిపోయిందని, వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు వైద్యులు.

ఇది తెలుసుకున్న మనీశ్​... రానాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మనీష్​ రెండేళ్లుగా రక్తం దానం చేయడం చూసిన రానా.. తాను కూడా అదే పని చేసేందుకు కొంచెం కూడా భయపడలేదు.

ఇదీ చదవండి:15 అంతస్తుల భవనంపై 'నడిచొస్తున్న మహాత్ముడు'

Last Updated : Jan 17, 2020, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details