తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిమిసంహారక టన్నెల్స్​పై కేంద్రం నిషేధం!

Dis infection tunnels prohibited across the country
క్రిమిసంహారక టన్నెల్స్ పై నిషేధానికి కేంద్రం సిద్ధం

By

Published : Sep 7, 2020, 1:14 PM IST

Updated : Sep 7, 2020, 1:40 PM IST

13:34 September 07

డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ప్రమాదకరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. క్రిమిసంహారక సొరంగాలు వినియోగించవద్దని ఇప్పటికే అందరికీ చెప్పామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం వివరించింది. హానికరమైనప్పుడు వాటిని ఎందుకు నిషేధించలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేస్తుందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో క్రిమిసంహారక టన్నెల్స్‌పై కేంద్రం నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్​సిమ్రన్ సింగ్ నరులా అనే న్యాయ విద్యార్థి ఈ సొరంగాలను నిషేధించాలని వ్యాజ్యం దాఖలు చేశారు. మనుషులపై ఉన్న క్రిములను సంహరించే పేరుతో పురుగుల మందులను చల్లడం నిషేధించాలని పిటిషనర్ కోరారు. వాటి ఉత్పత్తి, వాడకం సైతం నిలిపివేయాలని అభ్యర్థించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక రకాల క్రిమిసంహారక పరికరాలు మార్కెట్​లోకి వచ్చాయని, ఇవి వైరస్​ను నియంత్రిస్తాయని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. డబ్ల్యూహెచ్​ఓ సహా ఇతర ప్రామాణిక సంస్థలు వీటి ప్రమాదకరమైన ప్రభావం గురించి హెచ్చరించాయని గుర్తుచేశారు.

13:12 September 07

క్రిమిసంహారక టన్నెల్స్​పై నిషేధానికి కేంద్రం సిద్ధం

  • క్రిమిసంహారక టన్నెల్స్ వినియోగంపై సుప్రీం కోర్టులో విచారణ
  • వైద్య పరంగా, మానసికంగా హానికరమని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
  • డిస్-ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగించవద్దని అందరికీ చెప్పామన్న కేంద్రం
  • హానికరమైనప్పుడు వాటిని ఎందుకు నిషేదించలేదని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • రేపు కేంద్ర ప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేస్తుందని కోర్టుకు తెలిపిన ఎస్ జీ మెహతా
  • క్రిమిసంహారక టన్నెల్స్ పై దేశవ్యాప్తంగా నిషేధం విధించనున్న కేంద్రం
Last Updated : Sep 7, 2020, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details