తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ప్రభావం: నిరాడంబరంగా బక్రీద్​ వేడుకలు

కరోనా వేళ బక్రీద్‌ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

By

Published : Aug 1, 2020, 10:57 AM IST

Updated : Aug 1, 2020, 11:48 AM IST

Devotees arrive at Masjids to offer prayers on bakrid
కరోనా ప్రభావం: నిరాడంబరంగా బక్రీద్​ వేడుకలు

దేశ వ్యాప్తంగా బక్రీద్‌ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటారు. దిల్లీ సహా అనేక రాష్ర్టాల్లోని మసీదులు, ఈద్గాల ఉదయం నుంచే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కరోనా జాగ్రత్తల నడుమ బక్రీద్​ ప్రార్థనలు
నమాజ్​ చేస్తున్న కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్​ నఖ్వీ
జామా మసీదు లోపల బక్రీద్​ ప్రార్థనలు

దిల్లీలోని ప్రఖ్యాత ఫతేపూర్, జామా మసీదు వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్దలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

నమాజ్​లో పాల్గొన్న చిన్నారులు
జామా మసీదు వద్ద థర్మల్​ స్క్రీనింగ్​
వర్షం కురుస్తున్నా ప్రార్థనలకు హాజరు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు ఈద్గా ప్రాంగణాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మసీదుకు వచ్చే వారి ఉష్ణోగ్రతను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. మాస్కులు లేనిదే అనుమతించడం లేదు. భౌతిక దూరం పాటించాలని ప్రార్థనలకు వచ్చే వారికి అధికారులు సూచిస్తున్నారు.

భద్రత సిబ్బందికి సూచనలు ఇస్తున్న అధికారులు
బక్రీద్​ వేళ కట్టుదిట్టంగా భద్రత
బోధిస్తున్న మత గురువు
నమాజ్​ చేస్తున్న ముస్లింలు

ఇదీ చూడండి:ఉపాధ్యాయులకు బోధనేతర విధులొద్దు

Last Updated : Aug 1, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details