తెలంగాణ

telangana

ETV Bharat / bharat

119 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో దిల్లీ ఉష్టోగ్రతలు - 9.4 డిగ్రీల సెల్సియస్​గా న

దిల్లీ చరిత్రలో.. 119 ఏళ్ల తర్వాత డిసెంబర్​ నెలలో అతి తక్కువ ఉష్టోగ్రత నమోదైన రోజుగా సోమవారం నిలిచిందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 2.30 గంటలకు అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.

Delhi set to record coldest day in 119 years on Monday
119 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో దిల్లీ ఉష్టోగ్రతలు

By

Published : Dec 31, 2019, 5:10 AM IST

దిల్లీలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధాని చరిత్రలో.. 119 ఏళ్ల తర్వాత(డిసెంబర్​లో) అత్యంత కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

"దిల్లీలో 119 ఏళ్ల తర్వాత డిసెంబర్​ నెలలో అత్యంత తక్కువ ఉష్టోగ్రతలు నమోదైన రోజుగా సోమవారం రికార్డుకెక్కింది. రాష్ట్రంలో అసాధారణ రీతీలో చలి గాలులు వీస్తున్నందున మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 9.4 డిగ్రీల సెల్సియస్​గా నమోదైంది."
-కేంద్ర వాతావరణ శాఖ ట్వీట్​.

ఇదీ చూడండి:మరో ఏడాది పాటు ఎస్పీజీ చీఫ్​గా అరుణ్​ కుమార్​

ABOUT THE AUTHOR

...view details