తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అల్లర్లు: 38 మంది మృతి- భయం గుప్పిట్లోనే ప్రజలు

హింసాత్మక దిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది. 200కు పైగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దిల్లీవాసులు ఇంకా ఆ చేదు ఘటన నుంచి బయటకు రాలేకపోతున్నారు.

DEATH TOLL MOUNTS TO 38 IN DELHI RIOTS
అల్లర్లు: 38మంది మృతి- భయం గుప్పిట్లోనే రాజధానివాసులు

By

Published : Feb 28, 2020, 6:02 AM IST

Updated : Mar 2, 2020, 7:59 PM IST

దిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గురువారం నాటికి 38మంది ప్రాణాలు కోల్పోయారు. 200కుపైగా మంది గాయపడ్డారు. వీరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 23న ఈశాన్య దిల్లీలో పౌరసత్వ చట్ట సవరణ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ యావత్​ భారత దేశాన్ని కుదిపేసింది. దేశం నలుమూలల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లర్లు జరిగి నాలుగు రోజులు గడిచినప్పటికీ.. దిల్లీవాసులు ఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు. భయం గుప్పిట్లోనే బతుకుతూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఆప్​ పాత్ర...!

మరోవైపు.. ఆప్​ కౌన్సిలర్​ తాహీర్ హుస్సేన్​పై దిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. దిల్లీ అల్లర్లలో మృతి చెందిన నిఘా అధికారి(ఐబీ) అంకిత్​ శర్మ హత్య వెనకాల తాహీర్​ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శర్మ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తాహీర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తాహీర్ హుస్సేన్​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేసినట్లు ఆప్​ ప్రకటించింది.

ఎఫ్​ఐఆర్​...

దిల్లీ అల్లర్ల వ్యవహారంలో ఇప్పటి వరకు 48 ఎఫ్​ఐఆర్​లను నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు జరిపేందుకు రెండు ప్రత్యేక బృందాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ మొత్తం దర్యాప్తును అదనపు పోలీసు కమిషనర్ బి.కె.సింగ్ పర్యవేక్షిస్తారు.

రాజకీయం...

దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రధాన, విపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ద్వేష పూరిత ప్రసంగాల వల్లే ఘర్షణలు హింసాత్మకంగా మారాయని ఎదురుదాడికి దిగుతున్నాయి.

Last Updated : Mar 2, 2020, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details