దిల్లీ జీటీబీ ఆసుపత్రికి హర్షవర్ధన్
కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా దిల్లీలోని జీటీబీ ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. డ్రై రన్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.
09:58 January 02
దిల్లీ జీటీబీ ఆసుపత్రికి హర్షవర్ధన్
కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా దిల్లీలోని జీటీబీ ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. డ్రై రన్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.
09:06 January 02
దేశవ్యాప్తంగా డ్రై రన్
కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ చేపట్టింది కేంద్రం. 116 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో శనివారం ఉదయం డ్రై రన్ ప్రారంభమైంది.
ఈ డ్రై రన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును పరిశీలించనున్నారు అధికారులు. టాస్క్‌ఫోర్స్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మండల, బ్లాక్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు కొవిన్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
దిల్లీ జీటీబీ ఆసుపత్రికి వెళ్లనున్న ఆరోగ్య శాఖ మంత్రి..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. దిల్లీలోని దర్యాంగజ్లోని ఆరోగ్య కేంద్రంలో డ్రై రన్‌ను పరిశీలించారు అధికారులు. అలాగే.. దిల్లీలోని జీటీబీ ఆసుపత్రిని సందర్శించనున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.