దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో 488 మంది మృత్యువాతపడగా... 14,792 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతానికి 12,289 యాక్టివ్ కేసులు ఉండగా... 2,014 మంది కోలుకున్నారు.
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ - 12, గుజరాత్ - 10, మహారాష్ట్ర - 7, దిల్లీ - 4, ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో చెరో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.
అగ్రస్థానంలో మహారాష్ట్ర
కరోనా మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 201 మంది వైరస్ సోకి మరణించారు. మధ్యప్రదేశ్ - 69, గుజరాత్ - 48, దిల్లీ - 42, తెలంగాణలో 18 మంది కొవిడ్ కారణంగా మరణించారు. మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, అసోంల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
కేసుల విషయంలో 'మహా' అగ్రస్థానమే...
కేంద్ర హోంమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో అత్యధిక కరోనా కేసులతో (3,323) మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాల్లో దిల్లీ - 1,707, మధ్యప్రదేశ్ - 1,355, తమిళనాడు - 1,323 ఉన్నాయి.
గుజరాత్ - 1,272, రాజస్థాన్ - 1,229, ఉత్తర్‌ప్రదేశ్ - 969, తెలంగాణలో 791 చొప్పున బాధితులున్నారు.
కోలుకున్న వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధరణ
హిమాచల్‌ప్రదేశ్‌లోనే... ఇంతకు ముందు కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా అతనికి మరలా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.
హమీర్‌పూర్‌కు కరోనా పరీక్ష
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా యంత్రాంగం, అక్కడి 16,000 కుటుంబాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం 64 టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో రెండు కొవిడ్-19 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారత్‌లో 488కి చేరిన కరోనా మృతుల సంఖ్య ఇదీ చూడండి:'దేశంలో కరోనా మరణాల రేటు 3.3శాతం'